PAK vs BAN 2024: అఫ్రిది లేకుండానే పాక్ తుది జట్టు.. స్పష్టం చేసిన ప్రధాన కోచ్

PAK vs BAN 2024: అఫ్రిది లేకుండానే పాక్ తుది జట్టు.. స్పష్టం చేసిన ప్రధాన కోచ్

స్వదేశంలో పసికూన బంగ్లాదేశ్ ను క్లీన్ స్వీప్ చేద్దామనుకున్న పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ లో డిక్లేర్ చేసి కూడా ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీనికి తోడు స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టుకు 6 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లను కోల్పోయింది.  పాకిస్థాన్ తమ జట్టులో ఒక్క స్పిన్నర్ లేకుండా ఆడడం వారి కొంప ముంచింది.

గురువారం (ఆగస్టు 30) జరగనున్న రెండో టెస్టుకు పాకిస్థాన్ తమ 12 మంది సభ్యులను ప్రకటించింది. అయితే అనూహ్యంగా పాక్ జట్టులో ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిది చోటు దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని పాక్ ప్రధాన కోచ్ గిలెస్పీ అధికారికంగా ప్రకటించాడు. అయితే ఇందుకు కారణం కూడా అతడు వెల్లడించాడు. బిడ్డ పుట్టిన కారణంగా అఫ్రిది తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాడు. అతని నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం." అని ప్రీ మ్యాచ్ విలేకరుల సమావేశంలో గిల్లిస్పీ చెప్పాడు.

ALSO READ | Will Pucovski: బంతిని తలకు గురిపెడుతున్న బౌలర్లు.. ఎదుర్కోలేక ఆసీస్ బ్యాటర్ రిటైర్మెంట్

సిరీస్ సమం చేయాలంటే పాక్ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా నెగ్గి తీరాలి. లేకపోతే బంగ్లాదేశ్ పై సిరీస్ ఓడిపోయిన ఘోరమైన రికార్డ్ ను మూట కట్టుకోవాల్సి ఉంటుంది. స్పిన్నర్ అబీరార్ అహ్మద్ కొత్తగా జట్టులో చేరాడు. సొంతగడ్డపై రెండు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో ఉంది. 

పాకిస్థాన్ జట్టు:

షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ రిజ్వాన్ (డబ్ల్యుకె), నసీమ్ షా, సయీమ్ అయూబ్ మరియు సల్మాన్ అలీ అఘా.

బంగ్లాదేశ్ స్క్వాడ్:

నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జకీర్ హసన్, షద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, షోరీఫుల్ ఇస్లాం హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్.