పాకిస్తాన్ లో ఇంటర్నెట్, సోషల్ మీడియా సేవలు బంద్ అయ్యాయి. ఇన్ స్టా గ్రామ్, X(గతంలో ట్విట్టర్ ), Faceboll, Tik Tok, స్ట్రీమింగ్ దిగ్జజం YouTube తో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు అన్ని పనిచేయడం లేదు. దీంతో పాకిస్టానీ ఇంటర్నెట్ వినియోగదారులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI ఎన్నికల నిధుల సేకరణ టెలిధాన్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ దుస్సాహసానికి పాల్పడించదని ఆ పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి.
ఆదివారం( జనవరి 7) రాత్రి 9 గంటలకు వర్చువల్ ఫండ్ రైజింగ్ టెలిథాన్ , మ్యానిఫెస్ట్ లాంచ్ ను ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI తలెపెట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచే సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లను యాక్సెస్ చేయడంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో పార్టీ నిధుల సేకరణను అడ్డుకునేకుందుకే కావాలని ఆపద్ధర్మ ప్రభుత్వం ఇలా చేయించిందని PTI పార్టీ నాయకులు, మద్దతుదారులు విమర్శించారు. అయితే ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో కూడా ఆపద్దర్మ ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.