టీ20 వరల్డ్ కప్‌లో దాయాది పాకిస్తాన్‌పై టీమిండియా మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఆదివారం (జూన్ 9) పాకిస్థాన్ పై జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లింగ్ ఫైట్‌లో 6 పరుగులతో విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో అద్భుతంగా రాణించినా.. బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి చవి చూశారు. 120 లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ ఓడిపోవడంతో ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గెలిచే మ్యాచ్ లో ఓడిపోయేసరికీ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒక అభిమాని అయితే బహిరంగంగానే తన ఆవేదన చెప్పకొచ్చాడు.
వార్తా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ అభిమాని తన బాధను తెలియజేశాడు. "120 పరుగుల లక్ష్య ఛేదనలో తమ జట్టు ఓడిపోతుందని అసలు ఊహించలేదు. ఈ మ్యాచ్ చూడడానికి తన దగ్గర ట్రాక్టర్ అమ్మేశాను. ఈ ట్రాక్టర్ విలువ అక్షరాలా రూ.8.4 లక్షలు. మొదట టీమిండియా స్కోర్ కార్డు చుసిన తర్వాత పాకిస్థాన్ ఓడిపోతుందని అనుకోలేదు. ఓటమితో పాక్ ఫ్యాన్స్ బాధలో ఉన్నారు. గెలిచినందుకు భారత్ కు నా అభినందనలు". అని పాక్ అభిమాని చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా 19 ఓవర్లలో 119 రన్స్‌కే ఆలౌటైంది. రిషబ్ పంత్ (31 బాల్స్‌లో 6 ఫోర్లతో 42) సత్తా చాటగా, అక్షర్ పటేల్ (20) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హారిస్ రవూఫ్ చెరో మూడు వికెట్లు, మహ్మద్ఆమిర్ రెండు వికెట్ల దెబ్బకొట్టారు. ఛేజింగ్‌లో పాక్ ఓవర్లన్నీ ఆడి 113/7 స్కోరు చేసి ఓడింది. మహ్మద్ రిజ్వాన్ (31) పోరాడినా ఫలితం లేకపోయింది. బుమ్రాతో పాటు హార్దిక్ పాండ్యా (2/24), అక్షర్ పటేల్ (1/11) రాణించారు. బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.