
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో పాక్ 42 రన్స్ తేడాతో కివీస్‌పై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ ఆధిక్యాన్ని 4–1కి తగ్గించింది. టాస్ గెలిచిన పాక్ 20 ఓవర్లలో 134/8 స్కోరు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (38), ఫఖర్ జమాన్ (33) రాణించారు. సౌథీ, హెన్రీ, ఫెర్గూసన్, సోధీ తలా రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 92 రన్స్‌కే ఆలౌటైంది. గ్లెన్ ఫిలిప్స్ (26) టాప్ స్కోరర్. ఇఫ్తికార్ 3, షాహీన్ ఆఫ్రిది, మహ్మద్ నవాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇఫ్తికార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అలెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.