పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్

పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్

చంద్రునిపైకి పాకిస్థాన్ తన మొదటి మూన్ మిషన్ ఐక్యూబ్ ఖమర్ శుక్రవారం స్పెస్ లోకి లాంచ్ చేసింది. దీన్ని షాంఘై యూనివర్సిటీ SJTU, పాకిస్తాన్ జాతీయ అంతరిక్ష సంస్థ (SUPARCO) సహకారంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ (IST) బృందం ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. ఇది చైనా పెద్ద మిషన్‌ లూనార్ లో భాగం కాబట్టి.. చైనా నుంచే లాంచ్ చేశారు. దీని ద్వారా చంద్రమండలం పై నమోనాలను సేకరించి తిరిగి విజయవంతంగా భూమి మీదకు రావడమే దీని లక్ష్యం.

మే 3న బయలుదేరిన చంద్ర ప్రోబ్ మిషన్‌ 53 రోజులు పనిచేయనుంది. ఐదు రోజుల్లో లూనార్ చంద్రుడి కక్ష్యలోకి చేరుతుంది. ICUBE-Q ఆర్బిటర్ చంద్రున్ని చిత్రించడానికి రెండు ఆప్టికల్ కెమెరాలు ఉన్నాయి. ఈ మిషన్ లో చైనా  Chang'e-6 రాకెట్ లో పాకిస్తాన్ శాటిలైట్ ICUBE-QAMAR క్యూబ్‌శాట్‌ను పంపించారు. చంద్రుడిపై మానవాలి అన్వేషనే ఈ మిషన్ లక్ష్యమని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) తెలిపింది.