పాకిస్థాన్‌లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొద్ది క్షణాల్లో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనగా జరిగిన ఈ ప్రమాదంలో 97 మంది చనిపోయారు. పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన A-320 ఎయిర్ బస్ విమానం.. కరాచీ ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉన్న మోడల్ కాలనీలోని ఇళ్లపై కూలింది. లాహోర్ నుంచి కరాచీ వెళ్తుండగా విమానం క్రాష్ అయినట్లు పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ అధికారి అబ్దుల్లా హఫీజ్ ప్రకటించారు.
ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో.. మోడల్ కాలనీలోని ఒక ఇంటి సీసీటీవీలో రికార్డయింది. ఆ వీడియోలో విమానం చూడటానికి ల్యాండవుతుందేమో అన్నట్లుగా కనిపిస్తుంది. కానీ.. క్షణాల్లోనే ఇళ్లపై కూలి విమానం పూర్తిగా కాలిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Fresh footage of #karachiPlaneCrash filmed by CCTV camera. The plane seems to be crashing in a residential area killing almost all abode.
#karachiPlaneCrash #planecrash #Pakistan
pic.twitter.com/eSgapOzyAo— Mubarak Hussen Sheikh (@MUBARAKHUSSEN6) May 23, 2020
For More News..