నవాజ్ రిటర్న్స్ : పాకిస్తాన్ లో సరికొత్త రాజకీయం మొదలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ నాలుగేళ్ల తర్వాత స్వదేశానికి వచ్చారు.  గత నాలుగేళ్లుగా లండన్ లో ఉంటున్న ఆయన.. దుబాయ్ నుంచి ఇస్లామాబాద్‌కు ప్రత్యేక విమానంలో పాకిస్థాన్‌లో దిగారు. నవాజ్ షరీఫ్ తన కుటుంబ సభ్యులు , పార్టీ సీనియర్ నాయకులతో సహా  ఉమీద్-ఎ-పాకిస్తాన్  చార్టర్డ్ ఫ్లైట్‌లో వచ్చారు. విమానంలో అతనితో పాటు అతని స్నేహితులు కూడా ఉన్నారని సమాచారం.

నవాజ్ షరీఫ్ తన పార్టీకి నాయకత్వం వహించడానికి పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు. మూడు సార్లు ప్రధానిగా చేసిన ఆయన జనవరి 2024 పాకిస్థాన్‌  ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ సాయంత్రం   పీఎంఎల్ ఎన్ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు షరీఫ్.

Also Read : మా నాన్నను అన్యాయంగా జైల్లో పెట్టారు : కంటతడి పెట్టిన లోకేష్

2017 లో అవినీతి కేసులు షరీఫ్ ను దోషిగా తేల్చింది కోర్టు.  ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేదం విధించింది. ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.  అయితే వైద్య చికిత్స కోసం 2019లో  షరీఫ్ లండన్ వెళ్లారు.  అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఆయనకు ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు ప్రొటెక్టివ్ బెయిల్ మంజూరు చేయడంతో  స్వదేశానికి వస్తున్నారు. ప్రస్తుతం నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధానిగా ఉన్నారు.