IND vs PAK: బ్యాటింగ్‌లో తడబడిన పాకిస్థాన్.. టీమిండియా ముందు డీసెంట్ టార్గెట్

IND vs PAK: బ్యాటింగ్‌లో తడబడిన పాకిస్థాన్.. టీమిండియా ముందు డీసెంట్ టార్గెట్

ఛాంపియన్స్ ట్రోఫీ: దుబాయ్ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న గ్రూప్ మ్యాచ్ లో భారత బౌలర్లు సత్తా చాటారు. ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఒక మాదిరి స్కోర్ కే పరిమితం చేశారు. టీమిండియా బౌలర్లు సమిష్టిగా బౌలింగ్ చేయడంతో 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. టాపార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ 68 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కు మంచి ఆరంభం లభించింది. ఇమామ్ ఉల్ హక్(10), బాబర్ అజామ్(23) తొలి వికెట్ కు 50 బంతుల్లో 41 పరుగులు జోడించారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో పాకిస్థాన్ కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత కెప్టెన్ రిజ్వాన్, సౌద్ షకీల్ తీసుకున్నారు. మొదట తడబడిన వీరిద్దరూ.. ఆ తర్వాత భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. మూడో వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్ ను చక్క బెట్టారు.

Also Read :  హై వోల్టేజ్ మ్యాచ్.. హాజరైన మంత్రి లోకేశ్, డైరెక్టర్ సుకుమార్

ఈ దశలో భారత బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. దీంతో 14 పరుగుల స్వల్ప వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఖుష్దిల్ షా, అఘా సల్మాన్ 35 పరుగుల స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సల్మాన్ తో పాటు పాక్ లోయర్ ఆర్డర్ విఫలమైనా చివరి వరకు క్రీజ్ లో ఉండి ఖుష్దిల్ షా (38) పాక్ స్కోర్ ను 240 పరుగులకు చేర్చాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్య రెండు వికెట్లు తీసుకోగా.. అక్షర్ పటేల్, జడేజా, హర్షిత్ రాణాలకు తలో వికెట్ దక్కింది.