
లాహోర్ వేదికగా గడాఫీ స్టేడియంలో ట్రై సిరీస్ లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం (ఫిబ్రవరి 8) మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో మొదట న్యూజీలాండ్ బ్యాటింగ్ చేస్తుంది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న పాకిస్థాన్ అనవసరంగా తమ చెత్త నిర్ణయాలతో ఉన్న రెండు రివ్యూలు వృధా చేసుకుంది. అద్భుతమైన బంతితో విలియంసన్ వికెట్ తీసుకున్న షహీన్ అఫ్రిది.. లాతమ్ కు ఒక ఫుల్ టాస్ విసిరాడు. బంతి ప్యాడ్లకు తాకడంతో అప్పీల్ చేశారు.
అంపైర్ నాటౌట్ అనడంతో రివ్యూ కోరారు. బాల్ టాకింగ్ లో వికెట్లను మిస్ అవుతున్నట్టు చూపించింది. దీంతో పాకిస్థాన్ తమ తొలి రివ్యూ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్లో ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ వేసిన బంతిని ఆడడంలో ఫిలిప్స్ విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా వికెట్ కీపర్ రిజ్వాన్ చేతిలో పడింది. రిజ్వాన్ కాన్ఫిడెంట్ గా లేకపోయినా రౌఫ్ మాత్రం రివ్యూ తీసుకోవాల్సిందిగా సూచించాడు. అయితే అల్ట్రా ఎడ్జ్ లో బంతి బ్యాట్ కు దూరంగా వెళ్తున్నట్టు చూపించింది. అనవసర నిర్ణయాలతో పాకిస్థాన్ రెండు విలువైన రివ్యూ నెటిజన్స్ పాకిస్థాన్ జట్టును ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ ప్రస్తుతం 30 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజ్ లో మిచెల్ (47), ఫిలిప్స్ (7) ఉన్నారు. ఈ మ్యాచ్ లో కివీస్ కు మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్లోనే విల్ యంగ్ ను షహీన్ ఆఫ్రిది ఔట్ చేశాడు. నాలుగు బౌండరీలు కొట్టి ఊపు మీదున్న రచీన్ రవీద్ర అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటౌయ్యాడు. ఈ దశలో విలియంసన్ (58), మిచెల్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్ కు 95 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు.