IND Vs PAK: టాస్ ఓడిన భారత్.. పాకిస్థాన్ బ్యాటింగ్

IND Vs PAK: టాస్ ఓడిన భారత్.. పాకిస్థాన్ బ్యాటింగ్

ప్రపంచ క్రికెట్ ఎదురు చూస్తున్న సమరం మొదలైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభమైంది . దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పై పాకిస్థాన్ కు మంచి రికార్డ్ ఉంది. ఆడిన 5 మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఈ ఆత్మవిశ్వాసంతో మరోసారి టీమిండియాకు షాక్ ఇవ్వాలని పాక్ చూస్తుంది. మరోవైపు చిరకాల ప్రత్యర్థిని ఓడించి రాయల్ గా సెమీస్ లోకి అడుగు పెట్టాలని రోహిత్ సేన భావిస్తుంది.

ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. గాయపడిన ఫకర్ జమాన్ స్థానంలో ఇమాముల్ హక్ వచ్చాడు. మరోవైపు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.    

భారత్ ప్లేయింగ్ 11 (అంచనా )
  
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి, హర్షిత్ రాణా  

పాకిస్థాన్ ప్లేయింగ్ 11 (అంచనా) 

ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్