Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్థాన్

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్థాన్

క్రికెట్ ప్రేమికులకు ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ గా ప్రారంభమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్ లో ఆతిధ్య పాకిస్థాన్ తో న్యూజిలాండ్ తలపడనుంది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో గెలిచి బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇదే గ్రౌండ్ ఇటీవలే ఇరు జట్లు ట్రై సిరీస్ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ పేసర్ హారిస్ రౌఫ్ గాయం నుంచి కోలుకొని తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు కివీస్ జట్టులోకి ఫాస్ట్ బౌలర్ హెన్రీ వచ్చాడు. 


న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI):

డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(c), నాథన్ స్మిత్, మాట్ హెన్రీ, విలియం ఓరూర్క్

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):

ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్, వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మ