పాక్ మాజీ ప్రధాని, ఆయన భార్యకు 14ఏళ్ల జైలు శిక్ష రద్దు

తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి విధించిన 14ఏళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఈమేరకు సోమవారం (ఏప్రిల్ 1)న ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) ప్రధాన న్యాయమూర్తి అమీర్ ఫరూక్ వారి శిక్షను సస్పెండ్ చేస్తూ తీర్పు ఇచ్చారు. పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరి 31న ఇస్లామాబాద్ అకౌంటబులిటీ కోర్టు వారిద్దరికీ 14ఏళ్ల శిక్షను విధించిన విషయం తెలిసిందే..

ప్రభుత్వ అధికారులు ఒక ధర చెల్లించి వారికి వచ్చిన బహుతులని సొంతం చేసుకోలి. కానీ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిలో ఉండగా తక్కువ డబ్బు చెల్లించి ఆ బహుమతులను ఆయన సొంతం చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ప్రభుత్వానికి డబ్బు చెల్లించలేదని ఆయనతో పాటు అతని భార్యపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ముందు వారికి రూ.787 మిలియన్ల జరిమానాతోపాటు 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈరోజు ఇస్లామాబాద్ హైకోర్టు వారి శిక్షను రద్దు చేసింది.