ODI World Cup 2023: ఇండియాలో వరల్డ్ కప్ జరగడం వల్లే మేము ఓడిపోతున్నాం: పాక్ హెడ్ కోచ్

ODI World Cup 2023: ఇండియాలో వరల్డ్ కప్ జరగడం వల్లే మేము ఓడిపోతున్నాం: పాక్ హెడ్ కోచ్

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉంది. వరల్డ్ నెంబర్ 2 టీంగా, టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన బాబర్ సేన ఈ మెగా టోర్నీలో పేలవ ప్రదర్శన చేస్తుంది. ఏడేళ్ల తర్వాత భారత్ లో అడుగుపెట్టిన పాక్.. హైదరాబాద్ లో జరిగిన తొలి రెండు మ్యాచ్ ల్లో విజయాలను సాధించింది. అయితే ఆ తర్వాత వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో పరాజయాలను చవి చూసింది. తాజాగా పాక్ ఇలా వరుస ఓటములకు పాక్ హెడ్ కోచ్ స్పందిస్తూ అర్ధం లేని వ్యాఖ్యలు చేసాడు. 

కోచ్ బ్రాడ్‌బర్న్ మాట్లాడుతూ.. "భారత్ లో చాలా సంవత్సరాలపాటు పాకిస్థాన్ క్రికెట్ ఆడలేదు. ఎంత ప్రయత్నించినా మా ఆటగాళ్లు  ఇక్కడ పరిస్థితులను అర్ధం చేసుకోలేకపోయారు. టోర్నీ ప్రారంభంలో బాగా ఆడినా ఆ తర్వాత వరుసగా ఓడిపోయాం. భారత్ లో వరల్డ్ కప్ జరగడం వల్లే మేము గెలవలేకపోతున్నాం. అత్యుత్తమ ఆటగాళ్లతో ఆడినా విజయాలను సాధించలేకపోతున్నాం. ఆడే ప్రతి మ్యాచ్ గెలవాలని ఏ జట్టయినా కోరుకుంటుంది. పాక్ కూడా అదే కోరుకుని పూర్తిస్థాయిలో సన్నద్దతతో బరిలోకి దిగుతుంది". అని కోచ్  బ్రాడ్‌బర్న్ తెలిపారు.

Also Read : ODI World Cup 2023: ఆ రోజే చేయాలి: కోహ్లీ 49వ సెంచరీపై రిజ్వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇదిలా ఉండగా నేడు పాక్ వరల్డ్ కప్ లో (అక్టోబర్ 31) బంగ్లాదేశ్ పై మ్యాచ్ ఆడాల్సి ఉంది. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. వరుసగా నాలుగు  మ్యాచ్ ల్లో ఓడి పాక్ బరిలోకి దిగుతుండగా.. బంగ్లాదేశ్ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడింది. ఇప్పటికే బంగ్లా అధికారికంగా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించగా.. పాక్ కు మాత్రం ఇదే చివరి అవకాశం. మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఎవరు వారి పరాజయాలను బ్రేక్ వేసుకుంటారో చూడాలి.