రాక్షసులను చూసి మనుషులు భయపడిన కాలం నుంచి.. మనుషులను చూసి రాక్షసులు భయపడే రోజులు వచ్చేశాయ్.. ఏం చేస్తున్నామో.. ఎలాంటి పని చేస్తున్నామో సోయి లేకుండా.. అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారు మనుషులు.. పాకిస్తాన్ దేశంలో జరిగిన ఓ ఘోరం.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మనిషి అన్నోడు ప్రతోడి మైండ్ బ్లాంక్ అయ్యే ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
పాకిస్తాన్ దేశం పంజాబ్ ప్రావిన్స్ లో తోబా సింగ్ అనే కుటుంబం ఉంది. తోబాసింగ్ కు మారియా అనే చెల్లెలు ఉంది. ఆమె వయస్సు 22 ఏళ్లు. మార్చి 16 లేదా 17వ తేదీ రాత్రి.. ఇంట్లో అందరూ ఉండగా.. అందరూ మెళకువతో ఉండగానే.. సోదరి మారియా గొంతుకోసి మరీ చంపాడు అన్నయ్య తోబాసింగ్. ఇంటి ఆడబిడ్డను రక్తం పంచుకుని పుట్టిన అన్నయ్య కళ్ల ముందు చంపుతుంటే.. ఇంట్లో వారి పెళ్లి వీడియో తీసినట్లు వీడియో తీశారు. చెల్లెలను చంపిన తర్వాత.. ఆ అన్నయ్యకు ఇంట్లోనే ఉన్న మరో పెద్ద వయస్సు ఉన్న వ్యక్తి మంచినీళ్ల బాటిల్ అందించటం విశేషం.. ఈ వీడియో సోషల్ మీడియాలో రావటంతో పాకిస్తాన్ అధికారులు స్పందించారు. తీవ్ర విమర్శల మద్య తోబాసింగ్, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
22 ఏళ్ల మారియాను చంపుతున్నప్పుడు వీడియో తీసింది ఎవరో తెలుసా.. తోబాసింగ్ కుమార్తె అంట.. అత్తయ్యను చంపుతుంటే.. ఎంతో చక్కగా సెల్ ఫోన్ లో వీడియో తీయటం అనేది ఊహించని ట్విస్ట్.. మారియాను చంపటం వెనక ప్రేమ వ్యవహారం.. పరువు కారణం అయ్యి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
వీడియో బయటకు వచ్చిన తర్వాత.. విచారణ చేసిన పోలీసులు.. ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టిన మారియా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుల విచారణ తర్వాత అసలు కారణాలు వెల్లడిస్తామన్న పోలీసులు.. పరువు హత్య అని ప్రాథమిక సమాచారంగా స్పష్టం చేశారు.