
పహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాలు ఇండియా, పాక్ మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుని పాక్ను భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాకిస్తాన్ కూడా భారత్ నిర్ణయాలపై ప్రతీకార చర్యలకు దిగింది. భారత్తో వాణిజ్యాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పాకిస్తాన్ తాజాగా ప్రకటించింది. పాకిస్తాన్, భారత్ మధ్య 2024లో 1200 మిలియన్ డాలర్ల ట్రేడ్ జరిగింది.
భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ప్రస్తుతం పూర్తి తెగిపోయాయి. భారత్ విధిస్తున్న ఆంక్షలకు పోటీకు పాకిస్తాన్ దేశం అధికారికంగా ప్రకటనలు విడుదల చేసింది. భారతదేశంలో అన్ని రకాలుగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు వెల్లడించింది. అధికారికంగా ఇక నుంచి భారత్ నుంచి వాణిజ్య సంబంధాలు కూడా బంద్ చేస్తున్నామని పాక్ హైలెవల్ కమిటీ మీడియాకు వెల్లడించింది. భారతదేశం నుంచి ఎగుమతులు, దిగుమతులను బ్యాన్ చేసుకుంటున్నామని.. మూడో దేశాల నుంచి జరిగే వాణిజ్య లావాదేవీలనూ నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.
Also Read:-భారత్తో పూర్తిగా తెగదెంపులు చేసుకున్న పాకిస్తాన్..
ఇంతకీ భారత్ నుంచి పాకిస్తాన్ దేశానికి ఎగుమతి అయ్యేవి ఏంటీ.. పాక్ నుంచి ఇండియా దిగుమతి చేసుకునేవి ఏంటీ అనేది వివరంగా తెలుసుకుందాం..
పాకిస్తాన్కు భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువులు:
* ప్రధానంగా పత్తి
* ఫార్మాసూటికల్ ఉత్పత్తులు
* ఆర్గానిక్ కెమికల్స్
* పంచదార
* ప్లాస్టిక్ ఉత్పత్తులు
* ఫర్టిలైజర్స్
* అల్యూమినియం
* ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ ఎక్విప్ మెంట్
* రబ్బరు
* కాపర్
* కాఫీ, తేయాకు
* ప్రింటెడ్ బుక్స్, న్యూస్ పేపర్స్
* సిరామిక్ ఉత్పత్తులు
* వాచ్లు, గోడ గడియారాలు
* జింక్
* డైరీ ఉత్పత్తులు, కోడి గుడ్లు, తేనె
* సిల్క్
* వెంట్రుకలు, పక్షుల తోలు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్
పాకిస్తాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న వస్తువులు:
* సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్
* టెక్స్టైల్స్కు సంబంధించిన ముడి పదార్థాలు
* కర్జూరాలు, మామిడి పండ్లు, భారత్లో ఉల్లి, టమాటాకు కొరత ఏర్పడినప్పుడు పాక్ నుంచే దిగుమతి
* కెమికల్స్, ఇండస్ట్రియల్ ఉత్పత్తులు
* స్పోర్ట్స్ వస్తువులు, క్రికెట్ బ్యాట్లు, బంతులు, గ్లౌవ్స్.. ఇతరత్రా..