కరాచీ: ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఆడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. హైబ్రిడ్ మోడల్‌కు బీసీసీఐతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ కూడా సుముఖంగా లేకపోవడంతో పీసీబీకి టోర్నీ నుంచి తప్పుకోవడం మినహా మరో మార్గం కనిపించడం లేదు.
ఆసియా కప్‌ను పాక్ నుంచి తరలించడం దాదాపుగా ఖరారైంది. దీంతో ఈ నెలాఖరులో జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)లో దీనికి ఆమోదముద్ర వేయడం లాంఛనమే కానుంది. ఇక ఆసియా కప్ ఆతిథ్యం లభించకుంటే ఏం చేయాలన్న అంశంపై పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ.. తమ క్రికెట్ మేనేజ్‌మెంట్ కమిటీలతో పాటు ప్రభుత్వ అధికారులతో నూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.