ఇప్పటికే భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ తాజాగా మరోసారి ఇంధన ధరలను రూ.19 పెంచింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం పెట్రోల్ , డీజిల్ ధరలను వరుసగా రూ.14.91 , రూ.18.44 చొప్పున పెంచింది. తాజా పెంపుతో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.305.36గా ఉండగా, డీజిల్ ధర రూ.311.84కి చేరింది.
విద్యుత్ బిల్లుల పెంపుపై ఇటీవల దేశంలో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. ఈ క్రమంలో అక్కడి ప్రజలకు పెట్రోల్ , డీజిల్ ధరలను పెంచడం బిగ్ షాకిచ్చినట్లు అయింది. పెట్రోలు, డీజిల్ ధరలు రూ. 300 మార్క్‌ను దాటడం ఆ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు పెరగడం వల్లే దేశంలో కూడా పెంచుతున్నట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
ALSO READ:సెప్టెంబర్లో వీటికి ముగుస్తున్న గడువు..మిస్ చేస్తే భారీ మూల్యమే
పాకిస్థానీ రూపాయి విలువ నిరంతరం తగ్గుముఖం పట్టడం వల్ల సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చింది. ద్రవ్యోల్బణం గత వారం 30.82 శాతం నుంచి క్షీణించింది.