హైదరాబాద్ లో పాకిస్తాన్ ఫ్యాన్స్ : ఉప్పల్ స్టేడియంలో జీతేగా.. జీతేగా పాకిస్తాన్ జీతేగా.. స్లోగన్స్

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వార్మప్ మ్యాచులకు జనం లేకపోయినా.. అసలు సిసలు మ్యాచ్ లు ప్రారంభం కాగానే ప్రేక్షకుల ఆదరణ పెరిగింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 10వ తేదీ జరిగిన పాక్, శ్రీలంక మ్యాచ్ కు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. స్టేడియం కళకళలాడింది. 

Also Read : బీడబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నం.1 సాత్విక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడీ

ఉప్పల్ స్టేడియంలో పాక్, శ్రీలంక మ్యాచ్ ఆసక్తిగా సాగింది. శ్రీలంక ఇచ్చిన 344 పరుగుల టార్గెట్ ను.. పాకిస్తాన్ ఛేంజ్ చేసింది. మ్యాచ్ ఆసాంతంగా ఆసక్తిగా సాగింది. పాక్ ఆటగాళ్లు రిజవాన్,అబ్దుల్లా షఫీక్ సెంచరీలతో చెలరేగారు. దీంతో స్టేడియంలో పాకిస్తాన్ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.. జీతేగా.. జీతేగా.. పాకిస్తాన్ జీతేగా అంటూ ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించారు అభిమానులు. పాకిస్థాన్ కి హైదరాబాద్ లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు తమ మద్దతు తెలుపుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.

ఫ్యాన్స్ అంచనాలు తగ్గట్లే ఈ మ్యాచులో 345 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 10 బంతులుండాగానే ఛేజ్ చేసి హైదరాబాద్ కి ఘనమైన వీడ్కలు చెప్పారు. రిజవాన్,   ఇంతకు ఇదే మైదానంలో నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో కూడా పాక్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాకిస్థాన్ కి ఈ రేంజ్ లో అభిమానులు మద్దతు తెలపడం ఆశ్చర్యానికి గురి చేసింది. రెండు వారాల పాటు హైదరాబాద్ లో గడిపిన పాక్ ఇక్కడ మర్యాదల విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవడంతో తెలుగు వారి ప్రేమకు ముగ్దులయ్యారు. ఇక ఈ రోజు హైదరాబాద్ వదిలి పాక్ అహ్మదాబాద్ చేరుకోనుంది. వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 14 న భారత్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.