వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పోరాటం ముగిసిపోయింది. టాస్ ఓడిపోయినప్పుడే దాదాపు సెమీస్ నుంచి నిష్క్రమించిన పాక్ జట్టు.. ఇంగ్లాండ్ 100 పరుగులు దాటడంతో ఛేజింగ్ చేయకుండానే వరల్డ్ కప్ నుంచి ఇంటి దారి పట్టింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్ 150 పరుగులు దాటిపోయింది. ఒకవేళ ఇంగ్లాండ్ స్కోర్ 150 దాటితే పాక్ ఆ లక్ష్యాన్ని 3.4 ఓవర్లు అనగా 22 బంతుల్లో ఛేజ్ చేయాల్సి ఉంది. 22 బంతులకు 22 సిక్సర్లు కొట్టినా పాక్ 132 దగ్గరే ఆగిపోతుంది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ జోరును చూస్తుంటే ఈ మ్యాచ్ లో 300 పరుగులు చేసేలా కనిపిస్తుంది. అదే జరిగితే 6.1 ఓవర్లో ఈ లక్ష్యాన్ని ఛేజ్ చేయాల్సి ఉంటుంది. 37 బంతులకి 37 సిక్సర్లు కొట్టినా పాక్ స్కోర్ 222 పరుగుల వద్ద ఆగిపోతుంది. ఇంగ్లాండ్ ను 100 పరుగుల లోపే ఆలౌట్ చేస్తే పాక్ కు క్లిష్ట లక్ష్యం అయినా ఉండేది. కానీ ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆ ఆవకాశం కూడా పాక్ కు ఇవ్వలేదు. దీంతో పాక్ కు ఏదో మూల ఉన్న ఆశలు కూడా పోయాయి. ఈ మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లు తెలియజేస్తారు.
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు సెమీస్ కు చేరుకోగా తాజాగా న్యూజిలాండ్ కూడా సెమీస్ చేరుకుంది. మొదటి సెమీస్ లో భారత్, న్యూజిలాండ్ తో నవంబర్ 15 న తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముంబైలోని వాంఖడే ఆతిధ్యమివ్వబోతుంది. ఇక మరో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఢీ కొట్టబోతుంది. నవంబర్ 16 న కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరగనుంది.