పాకిస్తాన్ దేశం సొంతంగా ఓ యాప్ ను రూపొందించింది. వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా ఈ యాప్ ను ప్రారంభించింది. బీప్ పాకిస్తాన్ పేరుతో అభివృద్ధి చేసిన యాప్ ను ఆ దేశ ఐటీ మంత్రి అమీనుల్ హక్ ఆవిష్కరించారు. వాట్సాప్ యాప్ కు ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్ యాప్ ను రూపొందించిందని ఇప్పుడు తాము గర్వంగా చెప్పగలమని పేర్కొన్నారు.
ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే..
బీప్ పాకిస్తాన్ యాప్ ప్రస్తుతం ట్రయల్ దశలో ఉందని ఆ దేశ ఐటీ మంత్రి అమీనుల్ హక్ తెలిపారు. 30 రోజుల పాటు దీన్ని పరీక్షిస్తామని..విజయవంతం అయిన తర్వాత ఏడాది పాటు ప్రభుత్వ స్థాయిలో ఉపయోగిస్తామన్నారు. అనంతరం ఏడాది తర్వాత పాక్ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. తొలి దశలో ప్రభుత్వ అధికారులకు, రెండో దశలో మంత్రిత్వ శాఖలకు, మూడో దశంలో దేశ ప్రజలందరికి అందుబాటులోకి తెస్తామన్నారు.
బీప్ పాకిస్తాన్లో ఫీచర్లు..
బీప్ పాకిస్తాన్ యాప్ లో వాట్సాన్ వలే చాటింగ్, ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. బీప్ పాకిస్థాన్ అప్లికేషన్‌లో డాక్యుమెంట్ షేరింగ్, సెక్యూర్డ్ మెసేజింగ్, కాన్ఫరెన్స్ కాల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.