NZ vs PAK: టెస్ట్ కాదు అంతకుమించి: జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించిన పాక్ స్టార్ ప్లేయర్స్

NZ vs PAK: టెస్ట్ కాదు అంతకుమించి: జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించిన పాక్ స్టార్ ప్లేయర్స్

క్రికెట్ ప్రేమికులు అందరూ ప్రస్తుతం ఐపీఎల్ తో బిజీగా ఉంటే.. మరోవైపు పాకిస్థాన్ మాత్రం టెస్ట్ బ్యాటింగ్ తో విసుగు తెప్పించింది. బుధవారం (ఏప్రిల్ 2) న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ రెండో వన్డేలో పాక్ టాపార్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిపడ్డారు. 293 పరుగుల లక్ష్యం ఎదురుగా కనిపిస్తున్నా జిడ్డు బ్యాటింగ్ ఆడారు. హామిల్టన్ వేదికగా సెడాన్ పార్క్ లో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ 84 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఛేజింగ్ చేస్తున్నప్పుడు పాక్ స్టార్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 

ALSO READ | LSG vs PBKS: పంజాబ్ బ్యాటర్‌పై దురుసు ప్రవర్తన.. లక్నో బౌలర్‌పై కొరడా ఝుళిపించిన బీసీసీఐ!

భారీ లక్ష్య ఛేదనలో తొలి 10 ఓవర్లలో కేవలం 28 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయారు. 15 ఓవర్లు ముగిసేసరికి 49 పరుగులకు సగం జట్టు పెవిలియన్ చేరింది. పవర్ ప్లే లో కివీస్ బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్ బ్యాటర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. ముఖ్యంగా పాక్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ టెస్ట్ బ్యాటింగ్ ను గుర్తు చేశాడు. 27 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక ఓపెనర్ అబ్దుల్ షఫీక్ 11 బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేయగా.. మరో ఓపెనర్ ఇమాముల్ హక్ 12 బంతుల్లో 3 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. 

తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి టచ్ లోకి వచ్చిన బాబర్ అజామ్ ఒక పరుగుకే ఔటయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. సల్మాన్ అఘా 15 బంతుల్లో 9 పరుగులు.. తయ్యబ్ తాహీర్ 29 బంతుల్లో 13 పరుగులే చేయగలిగారు. లోయర్ ఆర్డర్ లో ఫహీమ్ అష్రాఫ్, నజీమ్ షా పోరాడి హాఫ్ సెంచరీలు చేయడంతో పాకిస్థాన్ ఘోర ఓటమి నుంచి బయటపడింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. లక్ష్య  ఛేదనలో పాకిస్థాన్ 208పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో న్యూజి లాండ్  మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది.