PAK vs NZ: పాక్ మహిళల విజృంభణ.. భారత అభిమానుల్లో చిగురిస్తున్న ఆశలు

PAK vs NZ: పాక్ మహిళల విజృంభణ.. భారత అభిమానుల్లో చిగురిస్తున్న ఆశలు

టీ20 ప్రపంచ కప్  కీలక మ్యాచ్ లో పాకిస్థాన్ మహిళలు విజృంభించారు. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో బౌలింగ్ లో సత్తా చాటి భారత్ సెమీస్ ఆశలు చిగురించేలా చేస్తున్నారు. పాకిస్థాన్ సమిష్టిగా బౌలింగ్ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజి లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులకే పరిమితమైంది. స్వల్ప స్కోర్ కావడంతో ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సగటు భారత అభిమాని పాక్ గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. పాక్ ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ సెమీస్ కు వెళ్తుంది.  
 
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆచితూచి ఆడింది. వికెట్లు కాపాడుకునే క్రమంలో స్కోర్ వేగం తగ్గింది. ఓపెనర్లు ఇద్దరూ జాగ్రత్తగా ఆడడంతో పవర్ ప్లే లో వికెట్ కోల్పోకుండా 39 పరుగులు మాత్రమే రాబట్టింది. పవర్ ప్లే తర్వాత పాక్ ఒక్కసారిగా చెలరేగింది. ఓ వైపు వికెట్లు తీస్తూనే మరోవైపు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో కివీస్ స్కోర్ మరీ నెమ్మదించింది. స్లో బంతులు వేస్తూ న్యూజి లాండ్ ఆటలు కట్టించారు. దీంతో 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. 28 పరుగులు చేసిన బీట్స్ టాప్ స్కోరర్ గా నిలిచింది. పాక్ బౌలర్లలో నష్ర సందు మూడు వికెట్లు తీసుకుంది.