క్రికెట్ స్టేడియంలో ఈతకొట్టిన పాక్ బౌలర్

శ్రీలంకలోని ఓ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ క్రికెట్ రచ్చ రచ్చ చేశాడు. మైదానంలో ఈత కొట్టాడు. వాన వల్ల మైదానాన్ని కవర్లతో కప్పేశారు గ్రౌండ్ సిబ్బంది. అయితే పాక్ క్రికెటర్లంతా డ్రెస్సింగ్ రూంలో ఉండగా..ఓ క్రికెటర్ మాత్రం..మైదానంలోకి దూసుకెళ్లాడు. కవర్లపై ఉన్న నీటి మీద జారుకుంటూ దూసూకెళ్లాడు. అతివేగంతో సర్రున జారుతూ ముందుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 

??pic.twitter.com/wyqxB7YtXM

— CricTracker (@Cricketracker) July 25, 2023
 

పాకిస్తాన్ క్రికెట్ టీమ్ శ్రీలంకలో పర్యటిస్తోంది. తొలి టెస్టులో గెలిచిన  పాక్.. కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులోనూ పూర్తి ఆధిక్యం కనబరుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకను 166 పరుగులకే ఆలౌట్ చేసిన పాకిస్తాన్..బ్యాటింగ్‌లో సత్తా చాటుతోంది. అయితే  రెండో రోజు  కొలంబోలో భారీ వర్షం కారణంగా ఆట సాగలేదు. మైదానం చెరువులా మారింది. దీంతో  స్టేడియాన్ని గ్రౌండ్ సిబ్బంది కవర్లతో కప్పేశారు. ఈ సమయంలో పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ ..గ్రౌండ్ లో తెగ ఎంజాయ్ చేశాడు. మిగతా ప్లేయర్లు రూంలోనే ఉంటే..హసన్ అలీ మాత్రం..చల్లని వాతావరణాన్ని బాగా ఆస్వాదించాడు. 

ALSO READ :మూసీకి పోటెత్తుతున్న వరద

డ్రెస్సింగ్ రూమ్‌ను వదిలి గ్రౌండ్‌లోకి పరిగెత్తాడు. కొద్ది దూరం వెళ్లాక..అకస్మాత్తుగా  కవర్లపై పడుకునూ నీటి మీద జారుకుంటూ దూసుకెళ్లాడు. కవర్లపై ఉన్న నీటిలో సరదాగా ఆట ఆడుకున్నాడు. అలీ చేష్టలను చూసి పాకిస్థాన్ ఆటగాళ్లు తెగ నవ్వుకున్నారు. ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.