ఐసీసీ వరల్డ్ కప్ నుండి పాక్ జట్టు తమ స్వదేశానికి చేరుకొని 10 రోజులైంది. వరల్డ్ కప్ ముగిసి రెండు రోజులు కావొస్తుంది. అయితే వరల్డ్ కప్ మ్యాచ్ లతో, పాక్ జట్టుతో నాకేం సంబంధం లేదన్నట్లు పాక్ పేసర్ హసన్ అలీ భారత్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అతని భార్య సమియా అర్జూతో కలిసి విహార తాజ్ మహల్ వద్ద కనిపించి సర్ ప్రైజ్ చేసాడు. ప్రస్తుతం ఇండియాలోనే ఉన్న ఈ పాక్ బౌలర్ నవంబర్ 22 న స్వదేశానికి బయలు దేరతాడు.
హసన్ అలీ భార్య సమియా అర్జూ భారతీయ సంతతికి చెందిన మహిళ. పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం జరిగి కూడా ఐదేళ్లు కావొస్తుంది. అయితే ఈమెకు ఢిల్లీలోని స్ట్రీట్ ఫుడ్ తినాలని.. ఇక్కడ ఆగ్రా లో ఉన్న తాజ్ మహల్ కు వెళ్లాలనే కోరిక ఉండేదట. ఈ సిటీని ఎంతగానో ఇష్టపడే సామియా ఇక్కడకి రావడం కుదరడం లేదు. అయితే ఏడేళ్ల తర్వాత భారత్ లోకి అడుగుపెట్టడంతో ఆమె కోరిక ఫలించందనుకున్నారు. సాధారణంగా వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ జరిగేటప్పుడు ఆటగాళ్లు ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్లకూడదని ఐసీసీ రూల్ విధించింది. దీంతో హాసన్ అలికి నిరాశ తప్పలేదు.
వరల్డ్ కప్ ముగియడంతో ఈ సీనియర్ పేసర్ లైన్ క్లియర్ అయింది. దీంతో అతని భార్య తో కలిసి ఎంచెక్కా ఇండియా మొత్తం విహరిస్తున్నాడు. ఇక భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో పాక్ 9 మ్యాచ్ ల్లో 4 మ్యాచ్ ల్లో విరాజయం సాధించగా.. హసన్ అలీ 6 మ్యాచ్ ల్లో 35.66 సగటుతో 9 వికెట్లు తీసాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు హసన్ అలీ ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. వరల్డ్ క ప్ తర్వాత పాక్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. ప్రపంచకప్ పరాజయం తర్వాత బాబర్ ఆజం కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. షాన్ మసూద్ కొత్త టెస్టు కెప్టెన్ గా ఎంపికయ్యాడు.
Pakistan pacer Hasan Ali with his wife Samya visited the Taj Mahal in Agra
— SportsTiger (@The_SportsTiger) November 21, 2023
?: Twitter#Cricket #HasanAli #CWC23 #TajMahal #Agra #PakistanCricket pic.twitter.com/R5gVnib8ll