ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు షాక్ తగిలింది. ఆ దేశ యువ పేసర్ మహ్మద్ హస్నేన్ పై ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ఐసీసీ) సస్పెన్షన్ విధించింది. రీసెంట్ గా ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ లో ఆడిన సమయంలో హస్నేన్ బౌలింగ్ యాక్షన్ పై అంపైర్లు ఫిర్యాదు చేశారు. దీంతో లాహోర్ లోని ఐసీసీకి చెందిన బయోమెకానిక్స్ ల్యాబ్ లో అతడికి పరీక్షలు నిర్వహించారు. అందులో హస్నేన్ అక్రమ బౌలింగ్ యాక్షన్ వేస్తున్నట్లు తేలడంతో.. ఐసీసీ అతడ్ని సస్పెండ్ చేసింది. కాగా, అత్యంత వేగంగా బంతులు విసురుతాడనే పేరున్న హస్నేన్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఆడిన ఓ మ్యాచ్ లో ఏకంగా 155 కి.మీ.ల వేగంతో బాల్ వేయడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్ లో 2019లో అరంగేట్రం చేసిన హస్నేన్.. పాక్ తరఫున 8 వన్డేలు, 18 టీ20 మ్యాచులు ఆడాడు.
The 21-year-old has undergone extensive testing in Lahore since he was reported on January 2 ?https://t.co/xN7c7vLJ8C
— ICC (@ICC) February 4, 2022
మరిన్ని వార్తల కోసం: