T20 World Cup 2024: నలుగురు పేసర్లతో పాక్.. భారత్‌కు అగ్ని పరీక్షే

T20 World Cup 2024: నలుగురు పేసర్లతో పాక్.. భారత్‌కు అగ్ని పరీక్షే

న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కొన్ని గంటల్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో ఎప్పటిలాగే ఈ మ్యాచ్ పై బజ్ ఏర్పడింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మరో వైపు పాకిస్థాన్ అమెరికా చేతిలో ఓడిపోయి ఒత్తిడిలో ఉంది. దీంతో భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. అయితే పాకిస్థాన్ ఒక విషయంలో మాత్రం భారత్ కంటే బలంగా కనిపిస్తుంది. వారి పేస్ విభాగం భారత్ కంటే బలంగా కనిపిస్తుంది. 

పాకిస్థాన్ క్రికెట్ జట్టు  ఓవరాల్ గా ఎలాగున్నా వారి పేస్ బౌలింగ్ మాత్రం అద్భుతం. యువకులతో నిండిన వారి పేస్ బౌలింగ్ ఎదుర్కోవాలంటే కఠిన సవాలే. షహీన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రౌఫ్ లాంటి యువ బౌలర్లకు ఈ సారి సీనియర్ పేసర్ మహమ్మద్ అమీర్ తోడయ్యాడు. వీరందరికీ భారత్ పై గతంలో మంచి రికార్డ్ ఉండడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. 2019 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పై అమీర్ తన బౌలింగ్ తో ఒంటి చేత్తో పాకిస్థాన్ కు విజయాన్ని అందించాడు.   

2021, 2022 టీ20 వరల్డ్ కప్ లో షహీన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రౌఫ్ ఇదే చేసి చూపించారు. వీటిలో 2021 వరల్డ్ కప్ లో పాక్ గెలిచింది. దీంతో మరోసారి పాక్ ఈ మ్యాజిక్ రిపీట్ చేయాలని ఆ దేశ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో పాక్ ను తక్కువగా తీసుకుంటే షాక్ ఇవ్వడం ఖయాంగా కనిపిస్తుంది. అమెరికాపై ఓడిపోవడంతో ఈ మ్యాచ్ లో పాక్ గెలవడం చాలా కీలకం. దీంతో ఈ మ్యాచ్ ను బాబర్ సేన చాలా సీరియస్ గా తీసుకుంది. పవర్ ప్లే లోనే భారత్ టాపార్డర్ ను పెవిలియన్ కు చేర్చాలని పాక్ భావిస్తోంది.