
- పాక్ పార్లమెంట్
ఇస్లామాబాద్: పహల్గాం దాడితో తమకుపాక్‌కు లింకులున్నట్లు మన దేశం చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ పాకిస్తాన్ పార్లమెంట్ శుక్రవారం ఓ తీర్మానం చేసింది. పార్లమెంటు ఎగువ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, అన్ని పార్టీల సభ్యులు మద్దతిచ్చారు. తమపై భారత్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది.
పాకిస్తాన్ విషయంలో భారత్ బ్లేమ్ గేమ్ ఆడటాన్ని మానుకోవాలని కోరింది. జల ఉగ్రవాదం, సైనిక కవ్వింపులు, దురాక్రమణలకు వ్యతిరేకంగా తమ నేలను కాపాడుకునేందుకు కావాల్సిన సామర్థ్యాన్ని పాక్ కలిగి ఉందని పేర్కొంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించడాన్ని ఖండించింది.