ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ప్రపంచ నెంబర్ 1గా పాకిస్థాన్

  ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ప్రపంచ నెంబర్ 1గా పాకిస్థాన్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు  ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచింది. 2023 ఆగస్టు 26 శనివారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాక్ జట్టు 59 పరుగుల తేడాతో విజయం సాధించడంతో  ఈ ఘనత సాధించింది.   ఈ మ్యాచ్  కు ముందు పాక్  2వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా కూడా ఇదే సంఖ్యలో రేటింగ్ పాయింట్లను కలిగి ఉంది. అయితే పాయింట్ల పరంగా మాత్రం ముందుంది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన  ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి నెం.1 స్థానానికి పాకిస్థాన్  చేరుకుంది.  

అయితే వన్డే ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా మొత్తం ఎనిమిది వన్డేలు ఆడనుండడంతో త్వరలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ ఎనిమిది మ్యాచ్‌లలో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాకు వెళుతుంది. ఆ తర్వాత భారత్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.  ఇక వన్డే ర్యాక్సింగ్ లో భారత్ మూడో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ నాలుగో స్థానంలో, ఇంగ్లండ్ ఐదో స్థానంలో నిలిచింది.  దక్షిణాఫ్రికా ఆరో స్థానంలో ఉండగా వెస్టిండీస్ ఏడో స్థానంలో ఉంది.   ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు వరుసగా 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి.