ఇంటర్నెట్ వినియోగంపై పాకిస్తాన్లో ఆంక్షలు.. కోర్టులో పిటిషన్

ఇంటర్నెట్ వినియోగంపై పాకిస్తాన్లో ఆంక్షలు.. కోర్టులో పిటిషన్

దేశంలో ఇంటర్నెట్ వినియోగంపై పాకిస్థాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించడం ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నెట్ ఫైర్‌వాల్‌ను ఏర్పాటు చేసే కొత్త ప్రణాళికలు పౌరుల స్వేచ్ఛను మరింత హరించవచ్చని ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

తీవ్రమైన ఇంటర్నెట్ సమస్యలు, రాజకీయ కారణాలతో పాకిస్తాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ఫైర్ వాల్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫాం లపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల ఆంక్షలు విధించిన తర్వాత తాజా నిర్ణయం ఆందోళనకు దారి తీసింది. 

ఇటీవల కాలంలో ఇంటర్నెట్ అంతరాయంతో దేశంలోని ఐటీ రంగానికి ఇప్పటికే 300 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ సాఫ్ట్ వేర్ హౌసెస్ అసోసియేషన్ తెలిపింది. ఫైర్ వాల్ ను ఏర్పాటు చేస్తే క్లయింట్ డేటా భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని PSHA  తెలిపింది. 

ఫైర్ వాల్ పై ఇస్లామాబాద్ కోర్టులో పిటిషన్ 

హమీద్ మీర్ అనే ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్ట్ ఫైర్ వాల్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఫైర్ వాల్ తో దేశంలో ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా తగ్గుతుందని పిటిషన్ లో తెలిపారు. ఇది పాకిస్తానీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన దేశ యువతపై ప్రభావం చూపుతుందని పిటిషన్ లో కోర్టుకు తెలిపారు.