పాక్​ 22 ఏండ్ల తర్వాత..ఆసీస్‌ గడ్డపై వన్డే సిరీస్ సొంతం

పాక్​ 22 ఏండ్ల తర్వాత..ఆసీస్‌ గడ్డపై వన్డే సిరీస్ సొంతం

పెర్త్‌‌ : ఆల్‌‌రౌండ్‌‌ షోతో చెలరేగిన పాకిస్తాన్‌‌.. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను పాక్‌‌ 2–1తో సొంతం చేసుకుంది. ఫలితంగా 22 ఏండ్ల తర్వాత ఆసీస్‌‌ గడ్డపై తొలి వన్డే సిరీస్‌‌ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్‌‌ ఓడిన ఆసీస్‌‌ 31.5 ఓవర్లలో 140 రన్స్‌‌కే ఆలౌటైంది. సీన్‌‌ అబాట్‌‌ (30), , మాథ్యూ షార్ట్‌‌ (22) టాప్‌‌ స్కోరర్లు. పాక్‌‌ బౌలర్ల ధాటికి ఇన్నింగ్స్‌‌లో ఆరుగురు సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు.

షాహిన్‌‌ ఆఫ్రిది, నసీమ్‌‌ షా చెరో మూడు, హరిస్‌‌ రవూఫ్‌‌ రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌లో పాకిస్తాన్‌‌ 26.5 ఓవర్లలో 143/2 స్కోరు చేసి నెగ్గింది. సైమ్‌‌ అయూబ్‌‌ (42), అబ్దుల్లా షఫీక్‌‌ (37), రిజ్వాన్‌‌ (30 నాటౌట్‌‌), బాబర్‌‌ ఆజమ్‌‌ (28 నాటౌట్‌‌) రాణించారు.  రవూఫ్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌, ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌’ అవార్డులు లభించాయి