T20 WC 2024: గ్రూప్ దశలోనే నిష్క్రమణ.. రియాజ్, రజాక్‌ లకు పాక్ క్రికెట్ బోర్డు షాక్

T20 WC 2024: గ్రూప్ దశలోనే నిష్క్రమణ.. రియాజ్, రజాక్‌ లకు పాక్ క్రికెట్ బోర్డు షాక్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీనియర్ జాతీయ సెలక్షన్ కమిటీ నుంచి వహాబ్ రియాజ్, అబ్దుల్ రజాక్‌లను తొలగించింది.వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో పాక్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. సూపర్ ఓవర్‌లో అమెరికా చేతిలో కంగుతిన్న బాబర్ అజామ్ సేన ఆ తర్వాత భారత్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. మొత్తం ఏడుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో రియాజ్, రజాక్ పేరును తొలగించనున్నారు. 

పాకిస్థాన్ మాజీ కెప్టెన్, పీసీబీ మాజీ హెడ్ రమీజ్ రాజా జట్టు ఎంపికపై విమర్శలు చేశారు. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన ఇమాద్ వసీమ్, మహ్మద్ అమీర్‌లను ఎంపిక చేయడం చాలా మందికి నచ్చలేదు. పీసీబీ మూడు నెలల క్రితం చైర్మన్ లేకుండానే సెలక్షన్ కమిటీని ప్రకటించింది. రియాజ్, రజాక్‌లతో పాటు కమిటీలో మహ్మద్ యూసుఫ్, అసద్ షఫీక్, జట్టు కెప్టెన్ బాబర్,  ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఉన్నారు. వహాబ్‌ను ఈ ఏడాది ప్రారంభంలో చీఫ్ సెలక్టర్‌గా తొలగించారు. 

Also Read: జింబాబ్వేతో నేడు మూడో టీ20.. టీమిండియా తుది జట్టుపై గందరగోళం

బోర్డులో గత నాలుగేళ్లలో రియాజ్‌తో సహా ఆరుగురు చీఫ్ సెలక్టర్లు ఉన్నారు. హరూన్ రషీద్, షాహిద్ అఫ్రిది, ఇంజమామ్-ఉల్-హక్, మహ్మద్ వాసిమ్, మిస్బా-ఉల్-హక్ ఈ లిస్టులో ఉన్నారు.