SA vs PAK 2024: సఫారీలకు ఝలక్: సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ నెగ్గిన పాకిస్థాన్

SA vs PAK 2024: సఫారీలకు ఝలక్: సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ నెగ్గిన పాకిస్థాన్

సౌతాఫ్రికా గడ్డపై 0-2 తేడాతో టీ20 సిరీస్ ను కోల్పోయిన పాకిస్థాన్.. వన్డేల్లో అంచనాలకు మించి ఆడుతుంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాకు షాక్ ఇస్తూ వన్డే సిరీస్ గెలుచుకుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకోవడం విశేషం. గురువారం (డిసెంబర్ 19) కేప్ టౌన్ వేదికగా న్యూలాండ్స్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో 81 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. సిరీస్ లో నామమాత్రమైన మూడో వన్డే డిసెంబర్ 22 న జరుగుతుంది. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసింది. బ్యాటర్లు అందరూ బాధ్యతగా ఆడడంతో 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయింది. మహ్మద్ రిజ్వాన్ 80 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. బాబర్ అజామ్ 73 పరుగులు చేసి చాలా కాలం తర్వాత వన్డేల్లో హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో కమ్రాన్ గులాం 32 బంతుల్లోనే 5 సిక్సర్లు.. 4 ఫోర్లతో 63 పరుగులు చేసి 300 పరుగుల మార్క్ దాటించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా 4 వికెట్లు తీసుకున్నాడు. మార్కో జాన్సెన్ కు మూడు వికెట్లు దక్కాయి. 

ALSO READ : IND vs AUS: ఓపెనర్‌పై వేటు.. టీమిండియాతో చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

330 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 248 పరుగులకే ఆలౌట్ అయింది. క్లాసన్ 97 పరుగులు చేసి జట్టు విజయం కోసం తీవ్రంగా పోరాడినా అతడికి సహకరించేవారు కరువయ్యారు. మిల్లర్ (29), జార్జి (34) లకు మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. షహీన్ అఫ్రిది నాలుగు వికెట్లు తీసుకొని విజయంలో కీలక పాత్ర పోషించాడు. నజీమ్ షాకు మూడు వికెట్లు దక్కాయి. అబ్రార్ అహ్మద్ రెండు.. సల్మాన్ అఘా తలో వికెట్ తీసుకున్నారు.