పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నివాసం బెనిగలా ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిటీలో మొత్తం 144 సెక్షన్ విధించారు. ఇమ్రాన్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని అతని సమీప బంధువు హసన్ నియాజీ ఆరోపించారు.
ఒకవేళ ఇమ్రాన్ కు ఏమైనా అయితే ..దాన్ని పాకిస్థాన్ పై దాడిగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు మా నాయకుడికి ఏదైనా జరిగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, కుట్రదారులు పశ్చాత్తాపం చెందుతారని అన్నారు. ఇవాళ ఇమ్రాన్ ఖాన్ తన నివాసానికి చేరుకోనున్నారని.. మాజీ మంత్రి ఫవాద్ చౌదరి తెలిపారు. నిఘా సంస్థల నివేదిక ప్రకారం... ఇమ్రాన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు తేలిందని ఫవాద్ ఏప్రిల్ లో ఆరోపించారు.
అందుకే ఇమ్రాన్ ఇంటి దగ్గర భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసిందన్నారు ఫవాద్. మరోవైపు ఇస్లామాబాద్ పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఇమ్రాన్ రాకపై ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం...