ఐసీసీ వరల్డ్ కప్ కు పాకిస్థాన్ టీవీ ప్రెజెంటర్ ని భారత్ కి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 2023 ICC ప్రపంచ కప్‌లో ప్రెజెంటర్ గా ఉన్న ఈమె ప్రస్తుతం న్యాయపరమైన చిక్కుల్లో పడింది. జైనాబ్ అబ్బాస్ గతంలో చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
భారతదేశాన్ని, హిందూ మతాన్ని విమర్శిస్తూ ఆమె చేసిన పాత ట్వీట్‌ల బయటపడడంతో ఆమెను దేశం విడిచి వెళ్లవలసిందిగా కోరారు. వస్తున్న సమాచారం ప్రకారం జైనాబ్ అబ్బాస్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. వినీత్ జిందాల్ అనే భారతీయ న్యాయవాది 35 ఏళ్ల జైనాబ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె హిందూ వ్యతిరేక ట్వీట్లు చేసిందని జిందాల్ పేర్కొన్నాడు. దీంతో ఆమె భారత్ ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఆమెను పాకిస్థాన్ కు పంపించారు.
- ALSO READ | ఇద్దరు హైదరాబాద్ క్రికెటర్లపై బ్యాన్
సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్, సామాజిక కార్యకర్త వినీత్ జిందాల్ జైనాబ్ అబ్బాస్ పై ఢిల్లీలోని సైబర్ సెల్ విభాగంలో ఇటీవల ఫిర్యాదు చేశారు. జైనాబ్ అబ్బాస్ పై సెక్షన్ ఐపీసీలోని 153ఏ, 295, 506,121, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అధికారులను కోరారు. ఐసీసీ ప్రపంచ కప్ నుంచి తక్షణమే స్పోర్ట్స్ ప్రజెంటర్స్ లిస్ట్ నుంచి ఆమె పేరును తొలగించాలనీ డిమాండ్ చేశారు. దీంతో ఆమె భారత్ ను వీడింది. ఇదిలా ఉండగా భారత్ పై పడి పాక్ ఏడుపు మొదలు పెట్టింది. భారత్ ఆమెను బహిష్కరించిందంటూ పాకిస్థాన్ మీడియా చెప్పుకొస్తుంది. జైనాబ్ అబ్బాస్ తనకు తానుగా భారత్ నుండి వెళ్ళిపోతే పాక్ మాత్రం భారత్ వెళ్లగొట్టిందని న్యూస్ సృష్టించింది.
There was always intrigue on what lies on the other side, more cultural similarities than differences, rivals on the field but camaraderie off the field, the same language & love for art & a country with a billion people, here to represent, to create content & bring in expertise… pic.twitter.com/dvoRUASpmm
— zainab abbas (@ZAbbasOfficial) October 2, 2023