PAK vs ENG 2024: పాక్ క్రికెట్‌లో సంచలనం.. టెస్ట్ జట్టు నుంచి బాబర్, అఫ్రిది ఔట్

PAK vs ENG 2024: పాక్ క్రికెట్‌లో సంచలనం.. టెస్ట్ జట్టు నుంచి బాబర్, అఫ్రిది ఔట్

వరుస ఓటముల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ తో జరగబోయే చివరి రెండు టెస్టులకు స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన పలికింది. ఆదివారం (అక్టోబర్ 13) ప్రకటించిన జట్టులో మాజీ కెప్టెన్ బాబర్ అజామ్, షాహీన్ షా ఆఫ్రిది లపై వేటు వేసింది. కొన్నేళ్లుగా వీరిద్దరూ ఘోరంగా విఫలమవుతున్నారు. బాబర్ గత చివరి 17 ఇన్నింగ్స్ ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అఫ్రిది వికెట్ల సంగతి పక్కన పెడితే బౌలింగ్ లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. 

నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, సర్ఫరాజ్ అహ్మద్‌లకు సైతం చోటు దక్కలేదు. హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్, కమ్రాన్ గులామ్, మహమ్మద్ అలీ, సాజిద్ ఖాన్. నోమన్ అలీ, జాహిద్ మెహమూద్‌లకు టెస్ట్ జట్టులో చోటు దక్కింది. షాన్ మసూద్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ఆరు టెస్టుల్లో ఓడిపోయింది. అయినప్పటికీ అతడిని కెప్టెన్ గా కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 15 నుంచి 19 వరకు ముల్తాన్ లో రెండో టెస్ట్.. అక్టోబర్ 24 నుంచి 28 వరకు రావల్పిండిలో మూడో టెస్ట్ జరుగుతుంది.      
 
ఇంగ్లాండ్ తో రెండు, మూడు టెస్టులకు పాకిస్థాన్ జట్టు:

షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, హసీబుల్లా (వికెట్-కీపీర్), కమ్రాన్ గులామ్, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, జాహిద్ మెహమూద్