డిసెంబర్ 10 నుంచి పాకిస్థాన్ సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఇందులో భాగంగా రెండు టెస్టులు.. మూడు వన్డేలు.. మూడు టీ20 ఆడనున్నాయి. జనవరి 7, 2024 వరకు ఈ టూర్ ఉంటుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బుధవారం (డిసెంబర్ 4) మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. పాక్ టెస్టు జట్టు నుంచి స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీకి ఛాన్స్ దక్కలేదు. ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అఫ్రిదీతో పాటు బాబర్ అజాం, నజీమ్ షా లపై వేటు వేసి పాక్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
సౌతాఫ్రికా పర్యటనలో బాబర్ అజాం, నజీమ్ షా టెస్ట్ జట్టులో పిలుపు అందుకున్నా.. అఫ్రిదికి మాత్రం మరోసారి మొండి చెయ్యి ఎదురైంది. అతడి మీద పని భారం తగ్గించడానికి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని.. అతను ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయానికి అత్యుత్తమ ఫిట్‌నెస్, ఫామ్‌లో ఉండాడని.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
ALSO READ : AUS vs IND: నమ్మకం లేనట్టే కనిపిస్తుంది: తుది జట్టులో స్థానంపై సందేహం వ్యక్తం చేసిన రాహుల్
దక్షిణాఫ్రికా పర్యటనకు పాకిస్థాన్ జట్టు
పాకిస్థాన్ టెస్ట్ జట్టు:
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీమ్ షా, నోమన్ అలీ, సైమ్ అయూబ్ మరియు సల్మాన్ అలీ అఘా.
పాకిస్థాన్ వన్డే జట్టు:
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ షా అఫ్రిది, సుఫ్యాన్ మొఖ్ది , తయ్యబ్ తాహిర్ మరియు ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).
పాకిస్థాన్ T20I జట్టు:
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ ఆఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సైమ్ షాహ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఘా, సుఫ్యాన్ మోకిమ్, తయ్యబ్ తాహిర్ మరియు ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్)
🚨 Pakistan squads announced for South Africa tour 🚨
— Pakistan Cricket (@TheRealPCB) December 4, 2024
🗓️ 3️⃣ T20Is, 3️⃣ ODIs and 2️⃣ Tests from 10 December to 7 January 🏏
Read more ➡️ https://t.co/7wp7q1U7Yb#SAvPAK pic.twitter.com/3PYbvFfSpz