టీ20 వరల్డ్ కప్ 2024కి ముందు పాక్ క్రికెటర్లు అష్టకష్టాలు పడుతున్నారు. ఫిట్ నెస్ కోసం పాక్ క్రికెట్ బోర్డు ఒక ప్రత్యేకమైన విధానాన్ని అవలంభించిన సంగతి తెలిసిందే. ఆర్మీ స్కూల్ లో వారికి శిక్షణ ఇప్పిస్తున్నారు. బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు ప్రస్తుతం కాకుల్‌లోని ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్‌లో శిక్షణ పొందుతూ వారి ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తోంది. 2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాక్ ఆటగాళ్ల ఫిట్ నెస్ అత్యంత పేలవంగా ఉంది. వీరి ఫిట్‌నెస్ ప్రమాణాలపై పీసీబీకి ఫిర్యాదులు రావడంతో పాకిస్థాన్ జట్టుకు ఆర్మీ దగ్గర కఠినమైన శిక్షణ ఇవ్వబడింది.
సైన్యం సమక్షంలో వివిధ రకాల సంప్రదాయ వ్యాయామాల ద్వారా పాకిస్థాన్ జట్టును పరీక్షిస్తున్నారు. పీసీబీ వారి సోషల్ మీడియా ఆటగాళ్లు ఫిట్ నెస్ కోసం శ్రమిస్తున్నట్టు సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇక్కడ ఆటగాళ్ళు రాళ్లను ఎత్తడం నుండి తాడు ఎక్కడం వరకు అనేక రకాల కార్యకలాపాలను చేస్తున్నారు. వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఆటగాళ్లు అత్యున్నత ఫిట్ నెస్ ప్రమాణాలను అందుకోవాలని.. ఈ ట్రైనింగ్ తమకు చాలా ముఖ్యమని ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ తెలిపాడు.
పాకిస్థాన్ సొంతగడ్డపై ఏప్రిల్ 18 నుంచి న్యూజిలాండ్ తో 5 టీ20 ల సిరీస్ ఆడుతుంది. వరల్డ్ కప్ కు ముందు ఈ సిరీస్ పాక్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని చూస్తుంది. జూన్ 1 నుంచి జూన్ 29 వరకు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ జరగనుంది. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1 న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా కెనడాతో తలబడుతుంది. జూన్ 29 న బార్బడోస్ ఫైనల్ కు ఆతిధ్యమిస్తుంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ సిటీలో జరుగుతుంది.
Pakistan cricket team gettimg trained by Pakistan Army, on how to play cricket 😂🤣pic.twitter.com/9sX4TgGvZS
— Frontalforce 🇮🇳 (@FrontalForce) April 6, 2024