ODI World Cup 2023: ఓటమి బాధే లేదు: కబాబ్, బిర్యానీలు లాగిస్తున్న పాక్ ఆటగాళ్లు

ODI World Cup 2023: ఓటమి బాధే లేదు: కబాబ్, బిర్యానీలు లాగిస్తున్న పాక్ ఆటగాళ్లు

పాక్ ఆటగాళ్లకు బిర్యానీకి ఎంత దగ్గర సంబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడేళ్ల తర్వాత భారత్ లో అడుగుపెట్టిన భారత్ వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం తొలిసారి హైదరాబాద్ లో దిగింది. ఇక్కడ బిర్యాని తిన్న పాక్ ఆటగాళ్లు చాలా బాగుందని .. హైదరాబాద్ బిర్యానిపై ఆటగాళ్లందరూ పొగడ్తల వర్షం కురిపించారు. అయితే వారి బిర్యాని గోల ఇక్కడితో ఆగలేదు. వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం వెళ్లిన ప్రతిచోట బిర్యాని లాగించేసారు. ఇటీవలే కోల్ కతా చేరుకున్న పాక్ ఆటగాళ్లు బిర్యానీ కోసం చేసిన పని ఆశ్చర్యానికి గురి చేసింది. 

వరల్డ్ కప్ లో భాగంగా రేపు (అక్టోబర్ 31) పాకిస్థాన్ తో బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం హోటల్ కి చేరుకున్న పాకిస్థాన్ టీం.. వీరు ఉంటున్న హోటల్ లో బిర్యాని లేదనే సరికి ఇక్కడ ఫుడ్ తినడానికి తిరస్కరించారు. వీరు జొమాటోలో బిర్యాని ఆర్డర్ చేసుకొని చేసుకోవడం వైరల్ గా మారింది. జొమాటో ద్వారా కోల్‌కతాలోని ఫేమస్ రెస్టారెంట్‌లలో  చాప్, ఫిర్నీ, కబాబ్‌లు, షాహి తుక్డా ఆర్డర్ చేసుకొని బాగా లాగించారని సమాచారం.

ఇక వరల్డ్ కప్ విషయానికి వస్తే పాక్ క్రికెట్ జట్టు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో రెండు విజయాలను సాధించి.. మరో నాలుగు మ్యాచ్ ల్లో ఓడింది. సెమీస్ అవకాశాలు క్లిష్టం చేసుకున్న ఆటగాళ్లు రేపు బంగ్లాదేశ్ పై గనుక మ్యాచ్ ఓడితే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తుంది. మొత్తానికి వరుస పరాజయాలు వెంటాడుతున్న బిర్యాని మీద మాత్రం వీరికి ఆశ పోలేదు.