వీళ్లు బరితెగించేశారు : కరాచీ తీరంలో మిస్సైల్ పరీక్షలు చేస్తున్న పాకిస్తాన్

వీళ్లు బరితెగించేశారు : కరాచీ తీరంలో మిస్సైల్ పరీక్షలు చేస్తున్న పాకిస్తాన్

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్ర దాడి తర్వాత.. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టుల నరమేధం వెనక పాకిస్తాన్ దేశం ప్రమేయం ఉందని భారత్ బలంగా నమ్ముతుంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో ఇండియా భద్రతా బలగాలను పెంచటంతోపాటు.. సైన్యాన్ని మోహరించింది. 

ఇదే క్రమంలో పాకిస్తాన్ మరింత కవ్వుంపు చర్యలకు పాల్పడుతుంది. 2025, ఏప్రిల్ 24వ తేదీ.. పాకిస్తాన్ లోని కరాచీ తీరంలో.. పాక్ ఆర్మీ మిస్సైల్ టెస్ట్ నిర్వహించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలం.. అంటే యుద్ధ విమానాల నుంచే ఈ మిస్సైల్స్ ను ప్రయోగించటం.. యుద్ధ విమానాల నుంచే ప్రత్యర్థులపై మిస్సైల్స్ దాడి చేయటం అన్న మాట. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత.. పాక్ ఆర్మీ.. ఈ మిస్సైల్ టెస్ట్ చేయటంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచింది.

కరాచీ తీరంలో పాకిస్తాన్ మిస్సైల్ పరీక్షలను.. భారత్ నిశితంగా పరిశీలిస్తుంది. ఎలాంటి మిస్సైల్ టెస్ట్ చేసింది.. వాటి సామర్థ్యం ఏంటీ.. వాటి రేంజ్ ఎంత అనేది అంచనా వేస్తుంది. పాకిస్తాన్ మిస్సైల్ టెస్ట్ అనేది కవ్వింపు చర్యల్లో భాగంగానే చేస్తుందని.. పాక్ నుంచి వచ్చే ఎలాంటి దాడినైనా.. ఎలాంటి చర్యలను అయినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ అంటోంది. 

కరాచీ తీరంలో పాకిస్తాన్ మిస్సైల్ టెస్టులను భారత ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. శాటిలైట్ ఆధారంగా డేటా కలెక్ట్ చేయటంతోపాటు.. పాకిస్తాన్ కవ్వింపు చర్యల వెనక ఉద్దేశాన్ని అంచనా వేస్తున్నాయి. భారత్ ఆర్మీ సైతం.. పాక్ సరిహద్దుల్లోని ఆర్మీ క్యాంప్ లకు అదనపు బలగాలను తరలిస్తుంది. 

పాక్ మిస్సైల్ పరీక్షలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణంతోపాటు.. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.