వన్డేల్లో ముక్కోణపు సిరీస్.. ఈ మాట విని చాలా సంవత్సరాలే అయింది. టీ20 క్రికెట్ ఎక్కువైన తర్వాత వన్డేల పైనే ఆసక్తి చూపించని క్రికెట్ అభిమానులు ఇక ట్రై సిరీస్ అంటే ఎవరు చూస్తారు. అందుకే ఈ ట్రయాంగిల్ సిరీస్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మళ్ళీ శ్రీకారం చుట్టింది. పాక్ వేదికగా 2025లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో ముక్కోణపు సిరీస్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్ ను ఫిబ్రవరి, మార్చిలో జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. 2017 తర్వాత మొదటిసారి ఈ ఐసీసీ టోర్నీ నిర్వహించనున్నారు. కొత్తగా నియమించబడిన పాక్ క్రికెట్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, క్రికెట్ సౌతాఫ్రికా (CSA) ఛైర్మన్ మిస్టర్ లాసన్ నైడూ, న్యూజిలాండ్ క్రికెట్ (NZC) ఛైర్మన్ మిస్టర్ రోజర్ ట్వోస్ కలిసి మార్చి 15న చర్చలు జరిపిన తర్వాత పాక్ క్రికెట్ బోర్డు ట్రై-సిరీస్‌ను ప్రకటించింది.
పాకిస్థాన్ చివరిసారిగా 2008లో బంగ్లాదేశ్‌లో ముక్కోణపు సిరీస్‌లో ఆడింది. ఈ సిరీస్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్‌లు ఆడాయి. పాకిస్థాన్ చివరిసారిగా అక్టోబర్ 2004లో నిర్వయించారు. ఈ ముక్కోణపు సిరీస్ లో పాకిస్థాన్ తో పాటు శ్రీలంక, జింబాబ్వేలు మరో రెండు జట్లు. ఇక అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే 2017–18 లో బంగ్లాదేశ్ ట్రై-నేషన్ సిరీస్ జరిగింది. ఈ ట్రయాంగిల్ సిరీస్ లో బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే జట్లు పాల్గొన్నాయి.
PCB is poised to host a tri-nation cricket event next year, as reported by ARY News. In a meeting held in Dubai, PCB Chairman Mohsin Naqvi, alongside counterparts from South Africa and New Zealand cricket boards, finalized plans for the Tri-Series.#TriSeries #Pakistan pic.twitter.com/5l4o06AeEp
— Startup Pakistan (@PakStartup) March 15, 2024