మార్చి1న లాహోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా–పాక్ పోరు!

మార్చి1న లాహోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా–పాక్ పోరు!
  •     చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ప్రకటించిన  పీసీబీ
  •     అంగీకారం తెలపాల్సిన బీసీసీఐ

న్యూఢిల్లీ:  వచ్చే ఏడాది జరిగే చాంపియన్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీకి ఆతిథ్య ఇవ్వనున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) టోర్నీ ప్రాథమిక షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. లాహోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికగా మార్చి 1న ఇండియా–పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, దీనికి బీసీసీఐ ఇంకా అంగీకారం తెలపాల్సి ఉందని ఐసీసీ బోర్డు సీనియర్ మెంబర్ ఒకరు చెప్పారు.  

ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనున్న ఈ టోర్నీలో 15 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల ప్రాథమిక షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ఐసీసీ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్ కోసం బార్బడోస్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన పీసీబీ చైర్మన్ మోహ్‌‌‌‌‌‌‌‌సిన్ నఖ్వి ఐసీసీకి అందించారు. భద్రత, ప్రయాణ కారణాల దృష్ట్యా ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను లాహోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటాయించారు. మొత్తంగా లాహోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు, రావల్పిండిలో ఐదు, కరాచీలో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

ఈ టోర్నీలో ఇండియా గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో కలిసి బరిలోకి దిగనుంది. గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. కాగా, ఈ టోర్నీ కోసం టీమిండియా పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతించాల్సి ఉంది. గతేడాది పీసీబీ ఆతిథ్యం ఇచ్చిన ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ కోసం ఇండియా.. పాక్‌‌‌‌‌‌‌‌కు వెళ్లలేదు. దాంతో టీమిండియా  మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను పాక్ బోర్డు శ్రీలంకలో షెడ్యూల్ చేసింది.