
పాక్ జలాల్లో ప్రవేశించి పట్టుబడిన భారతీయ జాలర్లను పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది. కరాచీలోని మాలిర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న 22మంది జాలర్లను విడుదల చేశారు. శనివారం రాత్రి వాఘా సరిహద్దు బార్డర్ వద్ద భారత అధికారులకు అప్పగించనుంచారు.
గుజరాత్ తీర గ్రామాలకు చెందిన మత్స్య కారులు సముద్రంలో వేటకు వెళ్లి అనుకోకుండా పాక్ జలాల్లోకి ప్రవేశించారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత శుక్రవారం జాలర్లు జైలు నుంచి విడుదల చేశారు.
ఈది ఫౌండేషన్ చైర్మన్ ఫైసల్ ఈది, మత్స్యకారులకు లాహోర్‌కు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు.అక్కడి నుండి వారు భారతదేశానికి తిరిగి ప్రయాణం కొనసాగిస్తారు.ఈధి ఫౌండేషన్ వారి ప్రయాణ ఖర్చులను భరించింది.
జనవరి 1న రెండు దేశాల మధ్య మార్పిడి చేయబడిన ఖైదీల జాబితా ప్రకారం పాకిస్తాన్‌లో 266 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు వారిలో 49 మంది పౌర ఖైదీలు, 217 మంది జాలర్లు ఉన్నారు.
భారత జైళ్లలో మొత్తం 462 మంది పాకిస్తానీలు ఉన్నారని వారిలో 381 మంది పౌర ఖైదీలు, 81 మంది మత్స్యకారులు. సముద్ర సరిహద్దులు సరిగ్గా గుర్తించబడ కపోవ డం వల్ల తరచుగా మరొక దేశ జలాల్లోకి ప్రవేశించే ప్రత్యర్థి మత్స్యకారులను రెండు దేశాలు అరెస్టు చేస్తాయి.