రావల్పిండి: ముష్ఫికర్ రహీమ్ (191) సెంచరీకి తోడు మెహిదీ హసన్ (77), లిటన్ దాస్ (55) దుమ్మురేపడంతో.. పాకిస్తాన్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ భారీ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 316/5 తో ఆట కొనసాగించిన బంగ్లా శనివారం నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 167.3 ఓవర్లలో 565 రన్స్‌కు ఆలౌటైంది. దాంతో 117 రన్స్ ఆధిక్యం దక్కించుకుంది. ముష్ఫికర్, హసన్ ఏడో వికెట్‌కు 196 రన్స్ జోడించారు. పాక్‌పై ఏడో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
ఎనిమిదిన్నర గంటలు క్రీజులో పాతుకుపోయిన ముష్ఫికర్ కెరీర్‌లో 11వ సెంచరీ కాగా, పాక్‌పై మొదటిది. నసీమ్ షా మూడు, షాహీన్, షెహజాద్, అలీ తలో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లలో 23/1 స్కోరు చేసింది. షఫీక్ (12 బ్యాటింగ్), షాన్ మసూద్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సైమ్ అయూబ్ (1) ఫెయిలయ్యాడు. ప్రస్తుతం పాక్ 94 రన్స్ వెనుకంజలో ఉంది.
Pakistan trail by 94 runs with nine wickets in hand as we head to final day of the first Test 🏏#PAKvBAN | #TestOnHai pic.twitter.com/bh9cznBmOj
— Pakistan Cricket (@TheRealPCB) August 24, 2024