ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు పాకిస్థాన్ లో పర్యటించనున్నాయి. పాకిస్థాన్ తో ఈ రెండు జట్లు ముక్కోణపు సిరీస్ ఆడనున్నాయి. వన్డే ఫార్మాట్ లో జరగబోయే ఈ టోర్నీ న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లకు ప్రాక్టీస్ గా ఉపయోగపడనుంది. ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 14 న ఫైనల్ తో ముగుస్తుంది. ఫిబ్రవరి 4 న మొదట న్యూజిలాండ్.. ఫిబ్రవరి 5న సౌతాఫ్రికా లాహోర్ చేరుకుంటాయి. ఇటీవలే పాకిస్థాన్ వెస్టిండీస్ పై టెస్ట్ సిరీస్ పూర్తి చేసుకొని ముక్కోణపు సిరీస్ పై దృష్టి పెట్టాయి.
ఈ ముక్కోణపు సిరీస్ కు షెడ్యూల్ 2024లోనే ప్రకటించారు. ఈ టోర్నీలో మొత్తం నాలుగు మ్యాచ్ లు జరగనున్నాయి. ఒక్కో జట్టు మిగిలిన రెండు జట్లపై ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఫిబ్రవరి 14న ఫైనల్ జరుగుతుంది. మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో మొదటి రెండు మ్యాచ్‌లు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లు కరాచీలోని నేషనల్ స్టేడియం ఆతిధ్యమివ్వనుంది.
Also Read : క్రికెట్‌లో టీమిండియా ఆల్ రౌండర్ అసాధారణ రికార్డ్
ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాక్టీస్ గా పాక్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్ ను ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. 2017 తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుగా ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్ ఏ లో ఉండగా.. సౌతాఫ్రికా గ్రూప్ లో ఉంది.
పాకిస్థాన్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వన్డే ముక్కోణపు సిరీస్:
ఫిబ్రవరి 8, శనివారం – పాకిస్తాన్ vs న్యూజిలాండ్ – మధ్యాహ్నం 2:30 గంటలకు – గడాఫీ స్టేడియం, లాహోర్
ఫిబ్రవరి 10, సోమవారం – న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా – ఉదయం 10:00 గంటలకు – గడాఫీ స్టేడియం, లాహోర్
ఫిబ్రవరి 12, బుధవారం – పాకిస్తాన్ vs దక్షిణాఫ్రికా – మధ్యాహ్నం 2:30 గంటలకు – నేషనల్ స్టేడియం, కరాచీ
ఫిబ్రవరి 14, శుక్రవారం – ఫైనల్ – మధ్యాహ్నం 2:30 గంటలకు – నేషనల్ స్టేడియం, కరాచీ
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?
ఇండియాలో ట్రై-సిరీస్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారమవుతుంది. OTT ప్లాట్‌ఫామ్ లో జియో సినిమాలో లైవ్ చూడొచ్చు.