ODI World Cup 2023 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్తాన్, గెలిస్తేనే సెమీస్ ఆశలు

ODI World Cup 2023 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్తాన్, గెలిస్తేనే సెమీస్ ఆశలు

క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో మరో బిగ్ ఫైట్. చెన్నై వేదికగా అక్టోబర్ 23వ తేదీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నది పాకిస్తాన్. ఈ మ్యాచ్ పాక్ జట్టుకు చావో రేవో.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పాకిస్తాన్.. ఆఫ్ఘనిస్తాన్ పై గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.

 మ్యాచ్ గెలిచి.. మిగతా జట్లకు గట్టిగా ఇవ్వాలని పాక్ భావిస్తుంది. అలా అని ఆఫ్ఘనిస్తాన్ ను లైట్ తీసుకోవటానికి ఏమీ లేదు. వాళ్లు ఎప్పుడు ఎలా ఆడతారో.. ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తారో అందరికీ తెలిసిందే. 

"చెన్నై పిచ్ అంటే.. స్పిన్. అక్కడ ఏదైనా జరగవచ్చు. మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అనేది ఊహించడం కష్టం. ఆఫ్ఘనిస్థాన్‌ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు(రషీద్‌ఖాన్‌, ముజీబ్‌, నబి) ఉన్నారన్న విషయాన్ని పాక్ ఆటగాళ్లు గుర్తుంచుకోవాలి. ఇప్పటి ఫామ్‌ను బట్టి వారిపై ఆధిపత్యం చెలాయించడం కొంచెం కష్టమే. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థానే ఫేవరెట్ అని నేను భావిస్తున్నా.." అని రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు.

ఇప్పటి వరకు ఈ ఇరు జట్ల మధ్య 7 వన్డేలు జరగగా.. అన్ని మ్యాచ్ లోను పాకిస్థాన్‌ విజయం సాధించింది. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాక్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. ఒక్క గెలుపుతో అఫ్గానిస్థాన్‌ అట్టడుగున ఉంది.

కీలకమైన మ్యాచ్ ల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు వీరోచితంగా పోరాడిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ సైతం లైట్ గా తీసుకోవటం లేదు ఈ మ్యాచ్ ను.. ఆఫ్ఘన్ పై గెలిచి.. రన్ రేట్ కూడా పెంచుకోవాలని చూస్తుంది.

ALSO READ : బీఎండబ్ల్యూ కారు కిటికీని పగులగొట్టి రూ.13 లక్షలు దోచుకెళ్లారు