
ఛాంపియన్స్ ట్రోఫీలో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్ లో తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్ వేదికగా జరగనున్న ఈ సమరంలో రెండు జట్లలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. ఇరు జట్లు కేవలం ఒక మార్పుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. మొదటగా పాకిస్థాన్ విషయానికి వస్తే న్యూజిలాండ్ జరిగిన తొలి మ్యాచ్ లో గాయపడిన ఫకర్ జమాన్ స్థానంలో ఇమాముల్ హక్ బాబర్ అజామ్ తో ఓపెనింగ్ చేయనున్నాడు. ఒకవేళ ఇమామ్ వద్దనుకుంటే ఉస్మాన్ ఖాన్ ఓపెనింగ్ చేయనున్నాడు.
బంగ్లాదేశ్ జరగబోయే తొలి మ్యాచ్ కు రోహిత్ సేన ఎలాంటి తుది జట్టుతో బరిలోకి దిగబోతుందో ఒక క్లారిటీ వచ్చేసింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తారు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండడం ఖాయం. వీరు ముగ్గురు జట్టులో ఉండడం వలన బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. 8 వ స్థానం వరకు భారత్ బ్యాటింగ్ దళం బలంగా ఉంటుంది.
ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ పాక్ తో సమరానికి ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకునే అవకావం ఉంది. అదే జరిగితే ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా బెంచ్ కే పరిమితం కావొచ్చు. ప్రధాన ఫాస్ట్ బౌలర్ గా షమీ జట్టులో కొనసాగనున్నాడు. మ్యాచ్ మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియో హాట్ స్టార్ లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది.
భారత్ ప్లేయింగ్ 11 (అంచనా )
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి. వరుణ్ చక్రవర్తి
పాకిస్థాన్ ప్లేయింగ్ 11 (అంచనా)
ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్