
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్ ఫైనల్ శుక్రవారం (ఫిబ్రవరి 14) జరగనుంది. కరాచీలో నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఆతిధ్య పాకిస్థాన్ జట్టుతో న్యూజిలాండ్ టైటిల్ కోసం తలపడుతుంది. ఈ సిరీస్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి కివీస్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంటే.. సౌతాఫ్రికాపై చివరి మ్యాచ్ లో గెలిచి ఫామ్ లోకి వచ్చింది. రెండు జట్లు బలంగా ఉండడంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారింది.
భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు జరుగుతుంది. మొహమ్మద్ రిజ్వాన్ సారధ్యంలో పాకిస్థాన్ బరిలోకి దిగుతుంది. సాంట్నర్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ అమీ తుమీ తేల్చుకోనుంది. సౌతాఫ్రికా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై కివీస్ ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉండడం విశేషం.
లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
ట్రై-సిరీస్ ఫైనల్ లైవ్ మ్యాచ్ ను ఇండియాలో సోనీ లివ్ యాప్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. వెబ్‌సైట్‌లోనూ ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. లైవ్ టెలికాస్ట్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుంది.
పాకిస్థాన్ జట్టు:
ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్, వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులామ్, ఫహీమ్ అష్రఫ్, హరీస్ ఖాన్, హరీస్ రౌ
న్యూజిలాండ్ జట్టు:
విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, బెన్ సియర్స్, విలియం ఓరూర్కే, రాచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్, నాథన్ స్మిత్, లాకీ ఫెర్గూసన్