![రసవత్తరంగా రెండో టెస్టు.. కష్టాల్లో పాకిస్తాన్](https://static.v6velugu.com/uploads/2025/01/pakistan-vs-west-indies-2nd-test-day-2-highlights-west-indies-in-command-pakistan-in-trouble_je8TwWXJBE.jpg)
ముల్తాన్ : పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. బౌలర్ల హవా నడుతుస్తున్న ఈ మ్యాచ్‌లో విండీస్ ఇచ్చిన 254 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో రెండో రోజు చివరకు ఆతిథ్య పాక్ 24 ఓవర్లలో 76/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ఓపెనర్లు షాన్ మసూద్ (2), ముహమ్మద్ హురారియా (2) నిరాశపరచగా.. బాబర్ ఆజమ్ (31), కమ్రాన్ గులామ్ (19) కాసేపు ప్రతిఘటించారు. విండీస్ బౌలర్లలో కెవిన్ సింక్లైర్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ప్రస్తుతం సౌద్ షకీల్ (13 బ్యాటింగ్), కశీఫ్ అలీ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మరో మూడు రోజుల ఆట మిగిలున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌కుఇంకో 178 రన్స్ అవసరం అవగా.. విండీస్ విజయానికి ఆరు వికెట్లు కావాలి. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 244 స్కోరు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (52) ఫిఫ్టీతో రాణించగా.. సాజిద్ ఖాన్, నోమన్ అలీ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.