ఆసియా కప్ 2023: ఇండియా గెలవాలని కోరుకుంటున్న పాకిస్థాన్.. ఎందుకంటే..?

ఆసియా కప్ 2023: ఇండియా గెలవాలని కోరుకుంటున్న పాకిస్థాన్.. ఎందుకంటే..?

ఆసియా కప్ లో పాకిస్థాన్ జోరుకి భారత్ బ్రేక్ లు వేసింది. ఒక్క భారీ పరాజయంతో ఇప్పుడు ఆసియా కప్ ఫైనల్ కి వెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సూపర్-4లో బంగ్లాదేశ్ మీద బోణీ కొట్టిన పాక్.. భారత్ మీద మాత్రం ఊహించని పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. అనవసరంగా భారత్ ని రెచ్చగొట్టి తగిన మూల్యం చెల్లించుకుంది. ప్రస్తుతం ఆసియా కప్ ఫైనల్ కి వెళ్లాలంటే ఏఏ జట్లకు ఎంత అవకాశం ఉందో ఒకసారి గమనిస్తే.. 

భారత్ గెలిస్తేనే పాక్ కి అవకాశం

కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం మరో కీలక పోరుకి ఆతిధ్యమివ్వనుంది. భారత్-శ్రీలంక ఆడనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకే కాదు పాకిస్థాన్ కి కూడా కీలకం కానుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆసియా కప్ నుండి నిష్క్రమించగా.. ఫైనల్ ఆడేందుకు ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. ఒకవేళ ఈ రోజు మ్యాచులో ఇండియా గెలిస్తే రన్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి తర్వాత మ్యాచులో బంగ్లాదేశ్ మీద ఓడినా ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక మరో ఫైనల్ బెర్త్ కోసం శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ అమీతుమీ తేల్చుకుంటారు.

 
ఒకవేళ ఈ మ్యాచులో భారత్ ఓడిపోతే పాకిస్థాన్ ఆశలు మరింత సంక్లిష్టం అవుతాయి. బంగ్లాదేశ్ మీద టీమిండియా గెలిస్తే అప్పుడు పాకిస్థాన్ శ్రీలంకపై నెగ్గినా రన్ రేట్ దారుణంగా ఉండడంతో నాలుగు పాయింటు ఖాతాలో ఉన్నా.. ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. శ్రీలంకను భారీ తేడాతో ఓడిస్తే పాక్ ఫైనల్ కి వెళ్లొచ్చు. కానీ అది దదాపుగా జరగని పని. దీంతో ఈ రోజు టీమిండియా గెలవాలని పాకిస్థాన్ కోరుకుంటుంది. మరి అంచనాలకు తగ్గట్టు ఆడి భారత జట్టు పాక్ కి మేలు చేస్తుందేమో చూడాలి.