ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఓడిపోవాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీతో పాటుగా ఆయన భావజాలం కూడా ఓడిపోవాలన్నారు. మోదీ ఓడిపోవాలని ప్రతి ఒక్క పాకిస్థానీ కోరుకుంటున్నాడని తెలిపారు. . పాకిస్థాన్‌కు భారత్‌పై ఎలాంటి ద్వేషం లేదన్న ఆయన.. కానీ ఇండియాలో బీజేపీ ప్రభుత్వం ముస్లింల పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందని ఆయన ఆరోపించారు.
Also read : కేజ్రీవాల్ కు సుప్రీమ్ కోర్టులో షాక్..
లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించి భారత్ తో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష భారత కూటమికి తాను మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించడానికి కారణమయ్యే రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీతో సహా ప్రతిపక్ష నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ కాగా మోడీపై ఫవాద్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.